గుంటూరు జిల్లా పొత్తూరు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడకిక్కడే మృతి చెందారు. గుంటూరు ఆర్వీఆర్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సుధీర్ కుమార్, ప్రకాశం జిల్లాకి చెందిన అతని స్నేహితుడు భానుతో కలసి పొత్తూరు నుంచి గుంటూరు బయలుదేరారు. వేగంగా వెళ్తూ... పొత్తూరు వద్ద మలుపు తిరుగుతున్న లారీని ఢీకొట్టారు. యువకులు లారీ మధ్య భాగాన్ని బలంగా తాకటంతో అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: మద్యం తాగి వేధిస్తోన్న భర్తను చంపిన భార్య