లాక్డౌన్ నేపథ్యంలో సొంతూరికు నడిచి వెళ్తూ రెండు వేరువేరు ప్రాంతాల్లో వలస కూలీలు మరణించిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా దేవనకొండ ప్రాంతానికి చెందిన రంగయ్య గుంటూరు జిల్లా పత్తిపాడు ప్రాంతంలో కూలీ పనుల కోసం కుటుంబంతో కలిసి వచ్చాడు. లాక్డౌన్ కారణంగా సరిగా పనులు లేకపోవటం... అప్పటి వరకూ వసతి గృహాల్లో ఉన్న తన పిల్లలు ఇంటికి రావటంతో సొంతూరికి పయనమయ్యారు.
రవాణా సౌకర్యాలు లేకపోవటంతో... తోటి కూలీలతో కలిసి కాలినడకన బయల్దేరారు. అచ్చంపేట చెక్పోస్ట్ వద్ద పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కు పంపించారు. వెనక్కి తిరిగి వస్తున్న క్రమంలో రంగయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సత్తెనపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి మృతిచెందాడు. మరో ఘటనలో వెంకటేశ్వర్లు అనే వలస కూలీ మరణించాడు. సత్తెనపల్లి మండలం కంటెపుడి వద్ద కాలినడకన వెళ్తుండగా... అక్కడ పోలీసులు ఉన్నట్లు గమనించారు. ఈ నేపథ్యంలో పంట పొలాల్లో నుంచి వెళ్లేందుకు యత్నించగా.... రాయి తగిలి కిందపడి మృతిచెందాడు.
ఇదీ చూడండి: