తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఎస్సారెస్పీ కెనాల్లో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సంక్రాంతిని పురస్కరించుకుని నూతన దుస్తులు ధరించి.. సెల్ఫీలు దిగేందుకు కెనాల్ వద్దకు నలుగురు యువకులు వెళ్లారు. ఇంతలో ప్రమాదవశాత్తు జారి ఇద్దరు కాలువలో పడ్డారు. గల్లంతైన ఇద్దరు యువకులు చిలుక రాంబాబు (20), చిలుక రాజేశ్ (18) అన్నదమ్ములని.. వారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా అనుపాలెంకు చెందినవారని తోటి యువకులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న తెలంగాణ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి: