దేశంలోని అనేక ప్రాంతాలకు భక్తులు, పర్యాటకులు నిత్యం పెద్దఎత్తున తరలివెళ్తుంటారు. వారిని గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ(RTC)తో పాటు ప్రైవేట్ ట్రావెల్స్‌దీ కీలకపాత్ర. సాధారణంగా వేసవి సెలవుల్లో టూరిస్టు, ట్రావెల్స్ బస్సులు ప్రయాణికులతో కళకళాడతాయి. ఈసారి మాత్రం కరోనా వల్ల వెలవెలబోతూ షెడ్లకే పరిమితమయ్యాయి. తొలి విడత మిగిల్చిన నష్టాలనే ఇంకా లెక్కలేసుకుంటూ ఉండగా.. రెండో దశ మరోసారి గట్టిగా దెబ్బ తీసింది.
వీటికి తోడు కర్ఫ్యూ(curfew) ఆంక్షలతో ప్రధాన నగరాలకు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రైవేట్ బస్సులు, కార్ల యజమానుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సర్వీసులు నిలిచిపోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఒక ఎత్తయితే.... నెలల తరబడి షెడ్లకు పరిమితమైన వాహనాల సర్వీసింగ్‌కు భారీగా ఖర్చవుతుందని ఆందళన చెందుతున్నారు.
ప్రైవేట్ బస్సులపై ఆధారపడి జీవనం సాగించే డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్కులకు.. రోజు గడవడమే కష్టంగా మారింది. ట్రావెల్స్(travels) రంగం మళ్లీ నిలదొక్కుకోవాలంటే ప్రభుత్వ ఆసరా కావాలని యజమానులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులతో నేడు లోకేశ్ సమావేశం