ETV Bharat / state

మీరు ఆర్సీ, డీఎల్​ కార్డు కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే ఇక ఆ విషయం మర్చిపోండి! - DRIVING LICENCE

DRIVING LICENCE SMART CARDS : మీరు ఏదైనా కొత్త వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకొని దాని రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్సీ) కోసం ఎదురుచూస్తున్నారా? డ్రైవింగ్‌ లైసెన్స్‌(డీఎల్‌) పరీక్షలో అర్హత సాధించి డీఎల్‌ కార్డు ఎప్పుడొస్తుందా అని వేచిచూస్తున్నారా? అయితే వాటి గురించి మరచిపోవాల్సిందే.

DRIVING LICENCE
DRIVING LICENCE
author img

By

Published : Dec 26, 2022, 2:14 PM IST

DRIVING LICENCE : మీరు ఏదైనా కొత్త వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకొని దాని రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్సీ) కోసం ఎదురుచూస్తున్నారా? డ్రైవింగ్‌ లైసెన్స్‌(డీఎల్‌) పరీక్షలో అర్హత సాధించి డీఎల్‌ కార్డు ఎప్పుడొస్తుందా అని వేచిచూస్తున్నారా? అయితే వాటి గురించి మరచిపోవాల్సిందే. ఇప్పట్లో కార్డులు వచ్చే పరిస్థితి లేదు. ఒక్కో కార్డుకు రూ.200 చొప్పున ఫీజును ముందుగానే రవాణాశాఖ వసూలు చేసినా వాటిని ఎప్పటికి జారీ చేస్తారనేది చెప్పే పరిస్థితి లేదు. పక్క రాష్ట్రాల్లో కార్డులు జారీ చేస్తున్నారు కదా? ఇక్కడెందుకు ఇవ్వలేరు? అని అడిగినా బదులివ్వరు. అసలు స్మార్ట్‌ కార్డులతో పనిలేదని, నకలు కాపీలుంటే చాలని అధికారులు ఉచిత సలహా ఇస్తుంటారు. ఇది రవాణాశాఖలో జరుగుతున్న తంతు. రాష్ట్రంలో రవాణాశాఖ ద్వారా ఆర్సీ, డీఎల్‌ స్మార్ట్‌ కార్డుల జారీ ఏడాదిన్నరగా నిలిచిపోయింది.

రోజుకు 10వేల కార్డులు

రాష్ట్రంలో రోజుకు సగటున 10 వేల వరకు ఆర్సీ, డీఎల్‌ కార్డులు జారీ కావాల్సి ఉంది. సాధారణంగా ఇవి వారం, పది రోజుల్లోనే పోస్టులో ఇళ్లకు చేరాలి. 2019 నుంచి వీటి పంపిణీలో ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ కార్డులు సరఫరా చేసే గుత్తేదారుకు డబ్బు చెల్లించకపోవడంతో.. నెలల తరబడి సరఫరా నిలిచిపోయింది.

ఫీజు తీసుకుంటారు.. నిధులివ్వరు!

ఏటా 36 లక్షల కార్డులను పరిగణిస్తే.. ఒక్కో కార్డుకు రూ.200 ఫీజు చొప్పున మొత్తం రూ.72 కోట్ల వరకు సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. ఒక్కో కార్డు కొనుగోలు, దానిపై వివరాలు ముద్రణకు రూ.70కి మించి ఖర్చు కాదు. ఒక్కో కార్డుపై ప్రభుత్వానికి రూ.130 చొప్పున మిగులుతుంది. అంటే రూ.72 కోట్లలో వెచ్చించాల్సింది రూ.25 కోట్లు మాత్రమే. అయినాసరే దానిని కూడా ఖర్చుచేసేందుకు రాష్ట్రప్రభుత్వానికి మనసు రావడంలేదు. పాత గుత్తేదారును పదేపదే తిప్పించి, వాయిదాల రూపంలో బకాయి చెల్లించారు. ఆ గుత్తేదారు వైదొలిగాడు. ఇప్పుడు కార్డులు సరఫరా చేసేవారే లేరు.

టెండరు పిలవకుండా కాలయాపన

స్మార్ట్‌కార్డుల సరఫరాకు సంబంధించి టెండర్లు ఖరారు చేయకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. కార్డులు సరఫరా చేసే గుత్తేదారులకు ఎంత కాలానికి ఓసారి చెల్లింపులు చేయాలి? ఆ కార్డులపై వివరాలు రాష్ట్రమంతా కలిపి రవాణాశాఖ కమిషనరేట్‌లో ముద్రించాలా? జిల్లాల వారీగా ముద్రించాలా? లాంటి అనేక సందేహాలను ఆర్థికశాఖ వ్యక్తం చేస్తూనే ఉంది.

వీటికి రవాణాశాఖ తగిన స్పష్టత ఇస్తున్నప్పటికీ.. స్మార్ట్‌ కార్డుల సరఫరా టెండరు డాక్యుమెంట్‌కు తుది ఆమోదం మాత్రం తెలపడంలేదని సమాచారం. టెండర్లు పిలిచి, గుత్తేదారు ఎంపికై కార్డులు సరఫరా చేశాక.. బిల్లులు చెల్లించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడంతోనే ఇలా జాప్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.