వినుకొండ - శావల్యపురం మధ్య విరిగిన రైలు పట్టా.. మరమ్మతు చేసిన సిబ్బంది - వినుకొండ-శావల్యపురం మధ్య రైలు ట్రాక్
గుంటూరు జిల్లా శావల్యపురం - వినుకొండ మధ్య రైలు పట్టా విరిగింది. దీనివల్ల కాసేపు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విరిగిన రైలు పట్టాను గుర్తించిన శావల్యపురం రైల్వే సిబ్బంది.. వెంటనే అప్రమత్తమై కొండవీడు ఎక్స్ప్రెస్ను శావల్యపురం రైల్వేస్టేషన్లో నిలిపేశారు. అనంతరం సిబ్బంది మరమ్మతులు పూర్తి చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.
'వినుకొండ-శావల్యపురం మధ్య రైలు ట్రాక్ మరమ్మతులు పూర్తి'