ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురికి గాయాలైన సంఘటన గుంటూరు జిల్లా నకరికల్లు సమీపంలో శనివారం రాత్రి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
నకరికల్లు మండలం త్రిపురాపురం గ్రామానికి చెందిన సుమారు 25 మంది కూలీలు ట్రాక్టర్ లో కండ్లకుంట గ్రామానికి వెళ్లి వస్తున్నారు. నకరికల్లు సమీపంలోకి రాగానే ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ప్రయివేట్ వైద్యశాలకు తరలించారు.
ఇదీ చదవండి: ఇంట్లో పిడుగుపడి రూ.20 లక్షల నగదు, బంగారం దగ్ధం