- కాపు రిజర్వేషన్లపై జనవరి 2న "చలో పాలకొల్లు": కాపు సంక్షేమ సేన
RESERVATIONS FOR KAPU : కాపులకు 5% రిజర్వేషన్ కల్పించే విషయంలో రేపటిలోపు స్పష్టత ఇవ్వాలని కాపు సంక్షేమ సేన నాయకులు డిమాండ్ చేశారు. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు హరి రామజోగయ్య పిలుపు నిచ్చిన "చలో పాలకొల్లు" కార్యక్రమానికి తమ మద్దతు తెలిపారు.
- వైసీపీ కార్యాలయానికి భూమి.. 33 ఏళ్ల లీజు.. ఏడాదికి ఎకరానికి వెయ్యి
Government Land allocation for YCP Office : వైసీపీ కార్యాలయాల నిర్మాణం కోసం 3 జిల్లాల్లో 55 కోట్ల రూపాయల విలువైన 4.75 ఎకరాల భూములను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కడపలో కేటాయించిన భూమి మార్కెట్ విలువ రూ.30 కోట్లు, అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో 1.75 ఎకరా వైసీపీ కార్యాలయానికి ఇచ్చారు.
- మా ఆదేశాలకు కొవిడ్ అడ్డొస్తే.. మరి వాటినెలా నిర్వహించారు:హైకోర్టు
HIGH COURT SERIOUS ON COLLECTOR: కోర్టు ఆదేశాల అమలుకు కొవిడ్ అడ్డొస్తే.. పంచాయతీ ఎన్నికలు, ప్రభుత్వ అధికార కార్యక్రమాలనెలా నిర్వహించారని పశ్చిమగోదావరి జిల్లా పూర్వ కలెక్టర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ రికార్డులను తమ ముందుంచాలని ఆదేశించింది.
- అప్పుల దారిలో జగన్ ప్రభుత్వం.. తాజాగా పోర్టుల పేరుతో అప్పులు..!
Andhra Pradesh is Stuck in Debt: రుణాల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..పోర్టులను కూడా వదలడం లేదు. ఏపీలో నిర్మించ తలపెట్టిన..భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పేరిట అప్పులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు గ్రామీణ విద్యుదీకరణ సంస్థ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లతో.. అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఈ రుణాలను సంపద సృష్టికి కాకుండా.. రెవెన్యూ వ్యయానికి మళ్లించే అవకాశం ఉన్నందున.. పనుల పురోగతి చూసే మంజూరు చేయాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు..
- ల్యాండింగ్‌కు నో చెప్పిన ఆఫీసర్స్.. అరగంట పాటు గాల్లోనే తిరిగిన విమానం.. చివరకు..
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని ఓ విమానం 30 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ముంబయి నుంచి వచ్చిన విమానాన్ని ప్రతికూల వాతవరణ పరిస్థితుల నేపథ్యంలో విమాన ల్యాండింగ్‌కు అనుమతించలేదు అధికారులు.
- జలపాతంలో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు
జలపాతంలో కొట్టుకుపోతున్న చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడాడు ఓ యువకుడు. ఈ ఘటన తమిళనాడు తెన్కాసిలో జరిగింది. పాలక్కడ్‌కు చెందిన దంపతులు పాత కుర్తాళం జలపాతం వద్దకు వచ్చారు. ఈ క్రమంలో స్నానం చేస్తుండగా వారి కూతురు నీటిలో జారి పడిపోయింది. దీనిని గమనించిన యువకుడు వేగంగా నీటిలోకి దూకి పాపను క్షేమంగా కాపాడాడు.
- 120 మిస్సైళ్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం
రష్యా మరో సారి కీవ్ నగరంలో విధ్వంసం సృష్టించింది. దాదాపుగా 120 మిస్సైళ్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మృతి చెందారని.. జెలెన్స్కీ సలహాదారు తెలిపారు. ఈ ప్రభావంతో రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాలకు నష్టం కలిగింది.
- 'వివేకానంద, మెస్సీ స్ఫూర్తితో ముందుకు సాగండి'.. అంబానీ వారసులకు ముకేశ్ దిశానిర్దేశం
2023 చివరికల్లా దేశవ్యాప్తంగా 5జీ మొబైల్ సేవలను విస్తరించాలని ప్రణాళిక రూపొందించారు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ. ఈ మేరకు రిటైల్ వ్యాపార విభాగానికీ లక్ష్యాలు సూచించారు. బుధవారం జరిగిన రిలయన్స్ ఫ్యామిలీ డేలో ఉద్యోగులనుద్దేశించి ముకేశ్ చేసిన ప్రసంగంలో కొన్ని విషయాలు పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- 127 గోల్స్ ఫర్ ఇయర్.. పీలే సాధించిన రికార్డులు ఇవే!
అసమాన ఆటతీరుతో బ్రెజిల్‌కు ఎన్నో అద్భుత విజయాల్ని అందించిన దిగ్గజ ఫుట్‌బాలర్ పీలే.. గురువారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తన సుదీర్ఘ కెరీర్లో పీలే సాధించిన కొన్ని రికార్డులను తెలుసుకుందాం..
- 2022 controversies: అనసూయ టూ దర్శన్.. సినీ ఇండస్ట్రీలో వివాదాలివే!
ప్రతి రంగంలోనూ వివాదాలు, విభేదాలు, గొడవలు, మాటల యుద్ధాలు సర్వ సాధారణం. అయితే, గ్లామర్ ఫీల్డ్‌లో జరిగేవి మాత్రమే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. తమ మాట తీరు వల్ల కొందరు నటులు వివాదంలో చిక్కుకోగా మరికొందరు ఇతరత్రా కారణాల వల్ల వార్తల్లో నిలిచారు. వారెవరు? చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయిన అంశాలేంటి? 2022 క్యాలెండర్ ఓసారి తిరగేద్దాం..