Weather Updates In State: నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ ద్రోణి విదర్భ నుంచి ఉత్తర కేరళ వరకు మరాట్వాడ అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు స్పష్టం చేసింది.
దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ, నైరుతి దిశలో గాలులు వీస్తున్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. రాబోయే మూడు రోజుల పాటు ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఉత్తర కోస్తాలో.. : తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని.. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముందని వాతావరణ విభాగం స్పష్టం చేసింది.
దక్షిణ కోస్తాలో: తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదని వెల్లడించింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని.. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముందని వాతావరణ విభాగం పేర్కొంది.
రాయలసీమలో: తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదని పేర్కొంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని.. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముందని వాతావరణ విభాగం పేర్కొంది..
ఎల్లుండి: తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది.
ఇవీ చదవండి: