రాష్ట్రంలో 2019-20 వార్షిక ఏడాదికి 136 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తిని సాధించేందుకు భారత పొగాకు మండలి తీర్మానించింది.పొగాకు బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘనాథబాబు అధ్యక్షతన పాలకమండలి సమావేశం గుంటూరులోని బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఆయా గ్రేడ్ల పొగాకు కిలోకు కనీస మద్దతు ధర ( ఎంఎస్పీ) రూ. 12.50 చొప్పున పెంచారు. నాణ్యమైన (బ్రైట్ రకం ) పొగాకుకు కిలో రూ.110-120,మధ్యస్థ (మీడియం) రకానికి రూ.95-105,తక్కువ (లోగ్రేడ్) కు రూ.50-60కనీస మద్దతు ధర ఉంది. ఉభయగోదావరి జిల్లాల్లోని నాణ్యమైన పొగాకు కిలోకు రూ.130 -140 ,మధ్యస్థ రకానికి రూ.110-120 ,లోగ్రేడ్ రూ50-60 మద్దతు ధర ఉంది.ఇప్పుడు ఆయా గ్రేడ్లకు కిలోకు అదనంగా రూ.12.50 పెంచటంతో రైతులకు రైతులకు లబ్ధి చేకురుతుంది. పొగాకు బోర్డు ఉపాధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన పోలిశెట్టి శ్యామ్సుందర్ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశారి, కరీనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి