అంతర్జాతీయంగా పొగాకు మార్కెట్.. సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులు దృష్టి సారించాలని పొగాకు బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు పేర్కొన్నారు. అన్ని దేశాలు పొగాకు వినియోగాన్ని తగ్గిస్తున్నాయని ఆయన తెలిపారు. కేవలం ఐదు కంపెనీలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా పొగాకు కొనుగోలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరిమితిగా పండించే పొగాకు నాణ్యత బాగుంటే రైతులకు మంచి ధర లభిస్తుందని చెప్పారు. గత ఏడాది అన్ని చర్యలు తీసుకున్న కారణంగా రైతులకు మంచి ధర లభించిందన్నారు.
తక్కువ గ్రేడ్ రకాలను కూడా మార్క్ఫేడ్ ద్వారా కొనుగోలు చేసేలా చూడగలిగామని రఘునాథబాబు అన్నారు. పొగాకు బోర్డు ఆర్ఎం శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా ప్రతికూల పరిస్థితులలో నికర ఆదాయం పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రధానంగా నల్లరేగడి నేలల్లో కంది, శనగ, మినుము, మిరప, జొన్న తదితర పంటలు లాభదాయకంగా ఉంటాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి రైతు పొగాకు బ్యారన్ చుట్టూ పది మొక్కలు నాటాలని వెల్లంపల్లి వేలం కార్యనిర్వహణ అధికారి ఉమాదేవి కోరారు.
ఇదీ చదవండి: