రాజధాని వికేంద్రీకరణను నిరసిస్తూ తాడేపల్లి మండలం పెనుమాకలో రైతులు నిర్వహించిన ధర్నాలో తులసీరెడ్డి పాల్గొన్నారు. రైతులు చేస్తున్న దీక్షకు తులసీరెడ్డి మద్దతు పలికారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధానిని తరలిస్తే... ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని పీసీసీ ఉపాధ్యక్షులు తులసీరెడ్డి స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతిని కేంద్రం ప్రభుత్వం గుర్తించిందని గుర్తుచేశారు. ప్రధాని అమరావతిలో శంకుస్థాపన చేశారని.. అలాంటిదానిని వేరే ప్రాంతానికి మారిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
ఇదీచూడండి.పకడ్బందీగా దిశ చట్టం అమలుకు సీఎం ఆదేశం