ETV Bharat / state

పదేళ్ల బాలిక అపహరణకు యత్నం.. అరుపులతో పరారైన దుండగులు - ten year old girl kidnap attempt in gutur

Thugs tried to kidnap a ten year old girl: పదేళ్ల బాలికను.. అపహరించే ప్రయత్నం చేశారు కొందరు దుండగులు. గమనించిన బాలిక గట్టిగా కేకలు వేయగా.. వారు అక్కడినుంచి పారిపోయారు. గుంటూరు జిల్లా జలాలుపురంలో ఈ ఘటన జరిగింది.

Thugs  tried to kidnap a ten year old girl at pedakurapadu in guntur
పదేళ్ల బాలిక కిడ్నాప్​కు యత్నించిన దుండగులు
author img

By

Published : Dec 25, 2021, 4:23 PM IST

Updated : Dec 25, 2021, 10:28 PM IST

Thugs tried to kidnap a ten year old girl: గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం జలాలుపురం గ్రామంలో.. పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసేందుకు దుండగులు యత్నించారు. ముఖాలకు మంకీ క్యాప్ లు వేసుకుని వచ్చిన సదరు వ్యక్తులు.. చలిమంట కాచుకుంటున్న బాలికను పట్టుకునే ప్రయత్నం చేశారు. సదరు చిన్నారి ప్రతిఘటించడంతో రాడ్​తో తలపై మోదారు. బాలిక తప్పించుకునే యత్నంలో పెద్దపెద్దగా కేకలు వేయడంతో.. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పరిగెత్తుకొచ్చారు. దీంతో.. దుండగులు పరారయ్యారు.

గ్రామంలో తమకెవరూ శత్రువులు లేరని.. బాలికను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారో అర్థంకావడం లేదని బాలిక తల్లిదండ్రులు తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

కర్నూలులో 16 ఏళ్ల మైనర్ కిడ్నాప్..
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్దుదేవకుంట గ్రామంలో.. 16 ఏళ్ల బాలిక నాలుగు రోజుల క్రితం అదృశ్యమైంది. తమ సమీప బంధువు కిడ్నాప్ చేసినట్లు కుటుంబ సభ్యులు మంత్రాలయం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. త్వరలో కేసును చేధించి బాలికను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎస్ఐ వేణు గోపాల్ రాజ్ తెలిపారు.

ఇదీ చదవండి:
Woman Sarpanch: కనీస గౌరవం ఇవ్వడం లేదు.. మహిళా సర్పంచ్​ ఆవేదన

Last Updated : Dec 25, 2021, 10:28 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.