గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ రోజు రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నరసరావుపేటలో కరోనా బాధితుల సంఖ్య మూడుకు చేరిందని నోడల్ అధికారి జి. శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇటీవల ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ కేసుతో మృతి చెందాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ వ్యక్తి కుటుంబసభ్యులతో పాటు, మరికొంతమందిని గుంటూరులోని క్వారంటైన్‌కు తరలించారు. అయితే వారికి పరీక్షలు నిర్వహించగా మృతి చెందిన వ్యక్తి కుటుంబంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా నిర్ధరణ అయ్యింది.
నరసరావుపేటలోని ఉన్నతాధికారులు అప్రమత్తమై.. ఇప్పటికే రెడ్ జోన్ ప్రకటించిన వరవకట్ట, రామిరెడ్డిపేట ప్రాంతాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆయా ప్రాంతాల నుంచి ఎవరినీ బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: వ్యాధి లక్షణాలు గుర్తిస్తే.. వెంటనే పరీక్షలు చేయాలి: సీఎం