Thief arrest in pedakakani: గుంటూరు జిల్లా పెదకాకానిలో దారి దోపిడీ దొంగ అనూహ్యంగా పోలీసులకు దొరికిపోయాడు. తాను వినియోగించే సామాజిక మాధ్యమం ఖాతానే అతన్ని పట్టించింది. హైదరాబాద్‌కు చెందిన నామాల సతీశ్ అతని తండ్రి రామకృష్ణారావు గత నెల 18న హైదరాబాద్ నుంచి కొలకలూరుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో బైక్‌పై వెళ్తుండగా తక్కెళ్లపాడు వద్ద దోపిడీ దొంగలు వారిని అడ్డగించి 4 వేల రూపాయలు, సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. తక్కువ మొత్తమే కదా అని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో దోపిడీ దొంగ ఖాతాను సతీశ్ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి శివ అనే నిందితుడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అతని స్నేహితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఎలా దొరికాడంటే..
theft in guntur: నాలుగు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో నిందితుని ఫొటో రైడర్ శివ అనే అకౌంట్‌తో కనిపించింది. వారు వాడిన పల్సర్ బైక్ ఫోటో కూడా అందులోనే ఉంది. దీంతో.. వెంటనే సతీశ్ పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్టాగ్రామ్ ఖాతా ఆధారంగా పోలీసులు ఆరా తీశారు. అతని స్నేహితుల ద్వారా వివరాలు సేకరించి శివను అరెస్టు చేశారు. అతని వద్ద బైక్ స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ శివపై చోరీ కేసులున్నట్లు పెదకాకాని సీఐ సురేశ్ బాబు తెలిపారు.
అయితే పోయింది తక్కువ మొత్తమే కదా... అమెరికా వెళ్లేటప్పుడు పోలీస్ కేసు ఎందుకని సతీశ్ తండ్రి రామకృష్ణారావు ఫిర్యాదు చేయలేదు. అయితే నాలుగు రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ దోపిడి దొంగ ఫొటో రైడర్ శివ అనే అకౌంట్‌తో కనపడిందని సతీశ్ మాకు సమాచారం ఇచ్చాడు. వారు వాడిన పల్సర్ బైక్ ఫోటో కూడా అందులో ఉందని చెప్పాడు. దీంతో వెంటనే సతీశ్ మాకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్టాగ్రామ్ ఖాతా ఆధారంగా శివను గుర్తించాం. అతని స్నేహితుల ద్వారా వివరాలు సేకరించి శివను అరెస్టు చేశాం. గతంలోనూ శివపై చోరీ కేసులున్నాయి. ఈ కేసు ఛేదనలో మాకు ఇన్స్టాగ్రామ్ ఉపయోగపడింది. సురేశ్ బాబు, పెదకాకాని సీఐ