Theft of idols in ancient temples: గుంటూరు జిల్లాలోని పిరంగిపురం మండలంలో గుర్తు తెలియని దుండగులు పురాతన వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. హౌస్ గణేష్ గ్రామం శివారు పొలాల్లో కొండపై ఆలయంలో ఈ వినాయకుడి రాతి విగ్రహం ఉంది. అయితే ఆ ఆలయంలో వినాయకుడి విగ్రం పగలగొట్టి ఉంది. ఈ విషయాన్ని స్థానికులు సోమవారం మధ్యాహ్నం గుర్తించారు. దీంతో ఎవరో గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. కాగా.. ఈ విగ్రహం 500 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు.
రాతి విగ్రహం పొట్ట భాగంలో గుప్త నిధులు ఉంటాయనే ఉద్దేశంతోనే దుండగులు ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ కమిటీ సభ్యులు ఫిరంగిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు విగ్రహాన్ని పరిశీలించారు. కాగా.. వినాయకుడి విగ్రహ ధ్వంసంపై ఆందోళనకు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో స్థానిక బీజేపీ నేతలు హౌస్ గణేష్పాడుకు బయల్దేరారు.
మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోనూ దుండగులు రెచ్చిపోయారు. అతి పురాతన ఆలయంలో నంది విగ్రహాన్ని దోచుకెళ్లారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హిందూపురంలోని అతి పురాతన అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రాంగణంలో చంద్రమౌళీశ్వరుడి ముందు నంది విగ్రహం ఉంది. కాగా.. ముగ్గురు దుండగులు సోమవారం రాత్రి.. ఆలయం వెనుకవైపు నుంచి లోపలికి ప్రవేశించి నంది విగ్రహాన్ని పెకిలించి దోచుకెళ్లారు.
ఈ ఘటనపై ఆలయ ఈవో ప్రధాన అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందిన వెంటనే హిందూపురం టూ టౌన్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే దుండగులు ఆలయంలో విలువైన సామగ్రిని ముట్టుకోకుండా.. కేవలం నంది విగ్రహాన్ని మాత్రమే పెకిలించి దోచుకెళ్లడంతో ఈ ఘటన పలు అనుమానాలకు దారి తీస్తోంది. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి:
- అలా జరిగితే 175స్థానాల్లో గెలుస్తాం.. ఏ ఒక్క ఎమ్మెల్యేనూ వదులుకోనూ: సీఎం జగన్
- 200 దుకాణాలు దగ్ధం.. రూ.50 కోట్లు నష్టం.. జీవనాధారం కోల్పోయామని వ్యాపారుల ఆవేదన
- పుష్ప-2 కొత్త ట్విస్ట్.. ఫుటేజ్ నచ్చక మొత్తం డిలీట్ చేసిన సుక్కూ.. రిలీజ్ ఇప్పట్లో కష్టమే!
- చైతూ-శోభిత డేటింగ్.. నేనలా అనలేదంటూ సమంత షాకింగ్ కామెంట్స్