గుంటూరు జిల్లా(Guntur district) వినుకొండ పట్టణంలోని రంగనాయకుల స్వామి దేవాలయం వద్దనున్న అనుష్క జ్యూయలర్స్లో చోరీ(Theft at a jewelery shop) జరిగింది. సుమారు 40 కిలోల వెండి, 1/4 కిలో బంగారు ఆభరణాలు, రూ.రెండు లక్షల నగదు చోరీకి గురైనట్టు దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజూ మాదిరిగానే రాత్రి షాపునకు తాళాలు వేశానని.. ఉదయం వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి షాప్లో ఉన్న వెండి, బంగారం, కౌంటర్లో ఉన్న రెండు లక్షల రూపాయలు అపహరణకు గురయ్యాయని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని నరసరావుపేట డీఎస్పీ విజయ భాస్కర రావు(narasaraopeta dsp vijaya bhaskara rao) చెప్పారు. వ్యాపారులు రాత్రి సమయంలో షాపులకు తాళాలు వేసే సమయంలో నగదును, విలువైన వస్తువులను ఇళ్లకు తీసుకపోవాలని సూచించారు.
ఇదీ చదవండి