కరోనా సోకినవారికి హోమ్ ఐసోలేషన్‌కు అనుమతి ఇవ్వొద్దని గుంటూరు జిల్లా తెనాలి సబ్‌కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులకు తెలిపారు. నరసరావుపేట మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కోవిడ్ బాధితుల నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని అధికారులకు ఆయన తెలిపారు. సెకండరీ కాంటాక్ట్ ... లక్షణాలు తక్కువగా ఉన్న వారిని ప్రత్యక్షంగా పరిశీలించిన తరువాతే హోమ్ ఐసోలేషన్‌కి అనుమతినివ్వాలన్నారు. అలా లేనివారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లలో చేర్చాలని ఆదేశించారు.
బాధితుల ఇళ్లకు వెళ్లి...
హోమ్ ఐసోలేషన్‌కు అనుమతి పొందిన వారి వివరాలు సేకరించి దినేష్ కుమార్.. స్వయంగా బాధితుల ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. బాధితులకు తగిన సౌకర్యాలు లేకుండా అనుమతులు ఎలా ఇచ్చారని అధికారులపై సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులకు హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్సలు నిర్వహించొద్దని తప్పనిసరిగా వైద్యశాలలోనే చికిత్సలు అందించాలని తెలిపారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 200పడకల హాస్పిటల్‌ను ఆయన సందర్శించారు. ప్రజలు మాస్క్‌లు ధరించకుండా తిరిగితే.. కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, అజయ్ కుమార్, తదితర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. అంతర్వేది ఘటనపై విచారణ జరపాలని భక్తుల డిమాండ్