రాష్ట్రప్రభుత్వం ఐదుగురు ఐఏఎస్. ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీచేస్తూ సోమావారం ఉత్తర్వులు జారీచేసింది. దిల్లీలోని ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్‌ను సీఎం ముఖ్యకార్యదర్శిగా నియమించింది. సాధారణ పరిపాలనశాఖ (రాజకీయ) ముఖ్యకార్యదర్శిగా ఆయనకు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది.
ఆర్పీసిసోడియా... సాధారణ ముఖ్యకార్యదర్శి స్థానం నుండి గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ,
వినోద్‌కుమార్ ...పార్వతీపురం ఐటీడీఏ పీవో స్థానం నుండి విజయవాడ సబ్ కలెక్టర్‌గా బదిలీ,
ఎండీ ఇలియాస్ రిజ్వీ (ఐఎఫ్ఎస్ )..ముఖ్య అటవీసంరక్షణ అధికారి(పీసీసీఎఫ్) స్థానం నుండి మైనారిటీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ,
ఎన్. ప్రదీప్ కుమార్ (ఐఎఫ్ఎస్ ).. ఎండీ, అటవీ అభివృద్ధిసంస్థ స్థానం నుండి ముఖ్య అటవీసంరక్షణ అధికారి(పీసీసీఎఫ్) గా అదనపు బాధ్యతలు.
ఇదీచూడండి. "కోడెల మృతిపై సమగ్ర విచారణ జరపాలి"