పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమారుడు 21 ఏళ్ల షారూఖ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గుంటూరు నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా... తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వర్షం కురుస్తుండటంతో.... రోడ్డు పక్కన బైక్ ఆపి జర్కిన్ తొడుగుతున్న సమయంలో వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో... అక్కడికక్కడే మృతి చెందాడు.
కారు డ్రైవర్ వేగంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. షారూఖ్ మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ...
మూడు రాజధానుల నిర్ణయం అనాలోచితం: సుప్రీంకోర్టు న్యాయవాది శ్యాం దివాన్