రాష్ట్రంలో తనకు రక్షణ లేకుండా పోయిందని మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. నరసారావుపేట తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసరావుపేటలో తన స్వగృహం వద్ద వైకాపాకు చెందిన వ్యక్తి పాత కేబుల్ వైర్లు కలిగిన ట్రక్కు తీసుకువచ్చి అడ్డంగా పెట్టి వెళ్లిపోయాడన్నారు. తమ కార్యకర్తలు ఆ ట్రక్కును తొలగించి గేటుకు తాళం వేస్తే... ఆ వ్యక్తి తిరిగి వచ్చి తమ సెక్యూరిటీ కార్యకర్తలను దుర్భాశలాడడమే కాక.. మళ్లీ ఆ ట్రక్కును తన గుమ్మం వద్ద నిలిపాడాని ఆరోపించారు. విషయం తెలిసి నరసరావుపేట డీఎస్పీకి సమాచారం ఇస్తే.. కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని సమాధామమిచ్చారని అన్నారు. ఇది ఎంతవరకు సబబు అని కోడెల ప్రశ్నించారు. మాజీ సభాపతినైన తనకే రక్షణ కల్పించలేని పోలీస్ వ్యవస్థ.. సామాన్యులకు ఎలా రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ వైకాపా చేతుల్లోక వెళ్లిందని ఆరోపించారు. గత తెదేపా ప్రభుత్వం అభివృద్ధి బాటలో నడిపిస్తే వైసీపీ ప్రభుత్వం దాడులు, దౌర్జన్యాలు, అక్రమాల బాటలో రాష్ట్రాన్ని నడుపుతోందన్నారు. తీరు మారకుంటే.. ఉద్యమానికి సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చదవండి: