ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుల్లో పోలీసులు తీరు సరిగా లేదని... జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించిన ఘటన నేపథ్యంలో... జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు తుళ్లూరు మండలం అనంతవరంలో పర్యటించారు. ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించిన ప్రాంతాన్ని పరిశీలించి... బహిరంగ విచారణ చేపట్టారు.
ఈ విచారణకు జిల్లా కలెక్టర్, గ్రామీణ ఎస్పీ రాకపోవడంపై రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరూ దిల్లీ వచ్చి సమాధానం చెప్పాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని... దీనిని అరికట్టాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. ఉండవల్లి శ్రీదేవి ఘటనను ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
ఇదీ చదవండీ... అదనపు అభియోగపత్రం దాఖలుపై జగన్ అభ్యంతరం