ఇదీ చదవండీ... మా నాన్నది రాజకీయ హత్యే: సునీతారెడ్డి
'మానవ హక్కుల కమిషన్కు రాష్ట్రంలో కార్యాలయం ఏదీ..?' - AP HRC News
రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్కు కార్యాలయం కేటాయించకపోవటాన్ని.. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం తప్పుబట్టింది. ఇటీవలే కమిషన్ ఛైర్మన్, సభ్యుల పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇంకా కార్యాలయం కేటాయించలేదు. ఇది కూడా మానవ హక్కులకు ఇబ్బంది కల్గించే చర్యగా పౌరహక్కుల సంఘం కార్యదర్శి పొత్తూరి సురేష్ అభిప్రాయపడ్డారు. మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజలు తమ హక్కులకు భంగం కలిగితే ఫిర్యాదు స్వీకరించేందుకు సరైన ఏర్పాట్లు చేయకపోవటం.. న్యాయాన్ని అందుబాటులో లేకుండా చేయటమేనన్నారు. వేలాది పిటిషన్లు ఇప్పటికే కమిషన్ వద్ద పెండింగ్లో ఉన్నాయని... అందుకే హైదరాబాద్లో గానీ, ఏపీలో గానీ మానవ హక్కుల కమిషన్కు కార్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
'మానవ హక్కుల కమిషన్కు రాష్ట్రంలో కార్యాలయం ఏదీ..?'
ఇదీ చదవండీ... మా నాన్నది రాజకీయ హత్యే: సునీతారెడ్డి