ETV Bharat / state

బర్నబాస్ హత్యలో అధికార పార్టీ నేతల ప్రమేయం: ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ - AP Latest News

Murder of Barnabas: గుంటూరు జిల్లా పొన్నూరు సిద్దార్థ నగర్‌కు చెందిన రేషన్‌ బియ్యం వ్యాపారి బర్నబాస్‌ హత్యకు గురైయ్యాడు. బర్నబాస్ హత్యలో అధికార పార్టీకి చెందిన నేతల ప్రమేయం ఉందని తెదేపా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఆరోపించారు.

Dhulipala Narendra Kumar
ధూళిపాల నరేంద్ర కుమార్
author img

By

Published : Oct 28, 2022, 8:51 PM IST

Murder of Barnabas: గుంటూరు జిల్లా పొన్నూరులోని సిద్దార్థ నగర్‌కు చెందిన రేషన్‌ బియ్యం వ్యాపారి బర్నబాస్‌ హత్య కేసులో అధికార పార్టీకి చెందిన నేతల ప్రమేయం ఉందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి స్థానిక శాసన సభ్యుడు కిలారి వెంకట రోశయ్య అక్రమ రేషన్ వ్యాపారాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని పొన్నూరులోని స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు.

బర్నబాస్ కిడ్నాప్ విషయంలో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే బర్నబాస్ ప్రాణాలతో ఉండేవాడని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో పోలీసులపై అధికార పార్టీ ఒత్తిడి ఉన్నందున, ముఖ్య నేతలను ఈ కేసు నుంచి తప్పించారని ఆరోపించారు. మృతుడి ఫోన్ కాల్ వాయిస్ రికార్డులను బహిర్గతం చేస్తే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. కేసును పూర్తిస్థాయిలో విచారించాలని జిల్లా స్థాయి అధికారులను కోరుతామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.