గుంటూరు జిల్లా కోటప్పకొండ ఆలయాన్ని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. కొండ దిగువ భాగాన మెట్లమార్గం వద్ద ఏర్పాటు చేసిన శివుని నూతన విగ్రహాన్ని మంత్రి ప్రారంభించారు. త్రికోటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోటప్పకొండలో ఏర్పాటు చేసిన నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం దేవాదాయశాఖకు పెద్దపీట వేస్తోందని, ఆలయాల అభివృద్ధికోసం ముఖ్యమంత్రి జగన్ రూ.250 కోట్లు కేటాయించారని వెల్లంపల్లి తెలిపారు. ఆలయాల ఆదాయాలను ప్రభుత్వం వాడుకుంటోదని కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదీచదవండి