వైకాపా సర్కారు విపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. అమరావతికి మద్దతుగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ప్రకాశం జిల్లాలో తెదేపా నేతల గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి రూ.700 కోట్ల జరిమానా విధించటాన్ని ఆయన తప్పుబట్టారు. కేవలం తెదేపా నేతల క్వారీలపైనే దాడులు చేసి.. వైకాపా నేతలకు చెందిన క్వారీలపైపు కన్నెత్తి చూడకపోవటం దారుణమన్నారు. జగన్ హయాంలో డీజీపీ కోర్టుకు వెళ్లాల్సి రావటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆక్షేపించారు. కేసుల మాఫీ కోసమే వైకపా ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు. శాసనమండలి సెలక్ట్ కమిటీ విషయంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వెళ్తోందని ధ్వజమెత్తారు.
ఇదీచదవండి