ETV Bharat / state

ఏపీ మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో.. ఏం జరుగుతుంది?

author img

By

Published : Nov 5, 2019, 9:34 AM IST

ఏపీ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం.... గుంటూరు జిల్లా బాపట్లలోని ఈ సంస్థ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఈ సంస్థకు డైరక్టర్ జనరల్ గా బదీలీ చేయడమే ఇందుకు కారణమైంది.

బాపట్లలోని ఏపీ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం

ఏపీ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ఎల్వీ సుబ్రహ్మణ్యం..

గుంటూరు జిల్లా బాపట్లలోని ఏపీ మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో.. గతంలో పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేవారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రాన్ని తెలంగాణాకు కేటాయించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ కోసం రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ 2015 ఆగస్టులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇన్నాళ్లూ విశ్రాంత అధికారులకే బాధ్యతలు

మొదట్లో కృష్ణా జిల్లా నూజివీడులోని భవనాల్లో కొంతకాలం ఏపీ మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని నిర్వహించారు. ఆ తర్వాత బాపట్లలోని పంచాయతిరాజ్ శిక్షణా కేంద్రంలోనే..... ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ 60 ఎకరాల్లకు పైగా శిక్షణా కేంద్రంఉండగా.. 2016 జూన్ లో ఇక్కడి నుంచి కార్యకలాపాలు మొదలయ్యాయి. గతంలో ఉన్న భవనాలతో పాటు మరో రూ. 8 కోట్ల రూపాయలతో ప్రభుత్వం కొత్త భవనాలు నిర్మించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణి తొలి డైరక్టర్ జనరల్ గా పనిచేశారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ కేంద్రానికి డీజీగా నియమితులయ్యారు. ఇక్కడ ట్రైనీ ఐఏఎస్ లతో పాటు, గ్రూప్ 1 అధికారులు, వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు. కేవలం ఏపీకి చెందిన వారికే కాకుండా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు సైతం ఇక్కడ శిక్షణ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

ప్రతి నెలా 2వేల మందికి పైగా వివిధ స్థాయిల్లోని అధికారులు, ఉద్యోగులు ఇక్కడ శిక్షణ పొందుతుంటారు. వారి బస కోసం గదులు, అలాగే డైనింగ్ హాల్, ఇతర ఏర్పాట్లు ఈ కేంద్రంలో ఉన్నాయి. గతంలో ఇక్కడ విశ్రాంత అధికారులు మాత్రమే పని చేసేవారు. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఇక్కడ నియమించే ముందే ..విశ్రాంత అధికారుల్ని ఇక్కడ తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి

రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.