ETV Bharat / state

చిలకలూరిపేట ఓగేరు వాగు వంతెన కింద మృతదేహం లభ్యం - చిలకలూరిపేటలో ఆత్మహత్య వార్తలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణ సమీపంలో ఓగేరు వాగు వంతెన కింద ఓ మృతదేహం లభించింది. వాగులో నీటి ఉద్ధృతి ఎక్కువ ఉండటంతో..ఎగువ ప్రాంతం నుంచి మృతదేహం కొట్టుకొని వచ్చిందా..అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

The dead body was found under the Chilakaluripet Ogeru bridge
చిలకలూరిపేట ఓగేరు వాగు వంతెన కింద మృతదేహం లభ్యం
author img

By

Published : Sep 9, 2020, 12:19 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణ సమీపంలో ఒంగోలు వైపు వెళ్లే రహదారిలో ఓగేరు వాగు వంతెన కింద నీటిలో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వాగులో నీటి ప్రవాహం ఉండడంతో ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకొని వచ్చిందా.. లేక ఎవరైనా వాగులో పడి మృతి చెందారా అనే విషయం తెలియాల్సి ఉంది.మృతుని వయసు 40 సంవత్సరాలు ఉండవచ్చని, బ్లూ జీన్స్ ప్యాంట్ , నల్ల చారలతో ఉన్న తెల్ల చొక్కా వేసుకుని ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నీటిలోనుంచి మృతదేహాన్ని బయటకు తీసి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి. అండగా నిలిచారు..ఆకలి తీర్చారు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.