సీఐడి అధికారులు తమపై నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని కోరుతూ మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు, అతని కుమారులు దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపులా వాదనలు ముగిసాయి. తీర్పును రిజర్వ్ చేేసింది. 0.26 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని.. దానికి సంబంధించిన ఎన్వోసీ పత్రాలు ఫోర్జరీ చేశారని, అయ్యన్న పాత్రుడుతో పాటు ఆయన కుమారులు విజయ్రా, రాజేష్ లపై కేసు నమోదు చేశారు. సీఐడి నమోదు చేసిన ఓ సెక్షన్ చెల్లుబాటు కాదని అయ్యన్న పాత్రుడు అరెస్ట్‌ను దిగువ కోర్టు తిరస్కరించిందని, హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
రాజకీయ దురుద్దేశంతోనే కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. అయ్యన్న, ఆయన కుమారులపై జలవనరుల శాఖ ఏఈ తమకు ఫిర్యాదు చేశారని, దాని దర్యాప్తు అనంతరం కేసు నమోదు చేశామని సీఐడీ న్యాయవాది వాదించారు. స్థలం ఆక్రమించారనేందుకు ఆధారాలున్నాయన్నారు. నిబంధనల మేరకే అరెస్ట్ చేశామని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్‌లో ఉంచింది. మరోవైపు అయ్యన్న పాత్రుడు అరెస్ట్ దిగువ కోర్టు తిరస్కరించటంపై సీఐడీ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం వచ్చే గురువారానికి తీర్పును వాయిదా వేసింది.
ఇవీ చదవండి: