గుంటూరు జిల్లాలో ఓ కేసుకు సంబంధించి నిందితుని అరెస్టు వ్యవహారం వివాదానికి దారితీసింది. తాడేపల్లి మండలం చిర్రావూరులో ఓ ఎరువుల దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన పోకల వెంకయ్యను పోలీసులు బుధవారం తెల్లవారు జామున విచారణ కోసం తీసుకెళ్లారు. ఈ విషయంపై వెంకయ్య భార్య కృష్ణప్రియ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు వెంకయ్యను తాడేపల్లి మండల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తనను అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని వెంకయ్య చెప్పారు.
ఎరువుల యజమానికి అప్పు పడిన మాట వాస్తవమేనని... అయితే అవి గతంలోనే చెల్లించానని తెలిపారు. అయినా దుకాణం యజమాని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని... సీఐ కూడా తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీనికి తోడు వెంకయ్య తమ్ముడు.. మార్కండేయులు తాడేపల్లి సీఐ అంకమరావు నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అయితే తనని తీసుకెళ్లింది వేరే సీఐ. కానీ అంకమరావు పేరిట వీడియో ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది... దీని వెనక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మార్కండేయులుపై గతంలో మహిళల్ని మోసం చేసిన ఫిర్యాదులు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
ఇదీ చూడండి: