రాజధాని పరిధిలోని మందడంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సచివాలయంలో జరిగే మంత్రిమండలి సమావేశానికి సీఎం హాజరుకానున్న నేపథ్యంలో... మందడంలో భారీగా పోలీసులు మోహరించారు. దుకాణాలను మూసి వేయించారు. ముఖ్యమంత్రి సచివాలయానికి వస్తున్నందున దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయాలని రైతులను ఆదేశించారు. ఇదే ప్రాంతంలో మూడు రాజధానులకు మద్దతుగా దీక్ష చేస్తున్న వారిని వదిలేసి.... తమను ఎందుకు ఖాళీ చేయమంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు
ఇవీ చదవండి