కౌలురైతు ధృవీకరణ పత్రంపై సంతకం చేయించుకుని వస్తే ఋణమిస్తామని బ్యాంకర్లు చెబుతున్నారని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బండారుపల్లి నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు కామినేని రామారావు తెలిపారు. కానీ అధికారులు మాత్రం సంతకాలు చేయకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. కౌలు రైతులు ఇప్పటికే పంటలకు పెట్టుబడులు పెట్టారని, దిగుబడులు వచ్చినా సరైన గిట్టుబాటు ధరలులేక పీకలలోతు అప్పుల్లో కూరుకుపోయారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందకపోతే వారికి ఆత్మహత్యలే శరణ్యమన్నారు.
ఇదీ చదవండి: వ్యవసాయశాఖ కమిషనరేట్ ఎదుట ఎంపీఈవోల ఆందోళన