గుంటూరు జిల్లా మంగళగిరి చినవడ్లపూడిలో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
చినవడ్లపూడి గ్రామానికి చెందిన కప్పవరపు ఆంజనేయులు అనే రైతు మూడెకరాల పొలం కౌలుకు తీసుకున్నాడు. అందులో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంట దెబ్బతినడం..పెట్టుబడి కింద ఓ వ్యక్తి వద్ద తీసుకున్న అప్పు చెల్లించమనడంతో రైతు బలవలన్మరణానికి పాల్పడ్డారు. మంగళగిరి రూరల్ ఎస్సై శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Amaravathi farmers: 'రాజధాని గ్రామాలపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ'