ETV Bharat / state

'కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం' - తెనాలిలో కోడిపందేలు వార్తలు

సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా తెనాలి డీఎస్పీ హెచ్చరించారు. ఆలయాల వద్ద ప్రత్యేక నిఘా పెంచుతామని చెప్పారు.

tenali dsp press meet on cock fight
తెనాలిలో కోడిపందేలు
author img

By

Published : Jan 10, 2021, 10:53 AM IST

సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహించినా, పాల్గొన్నా.. కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా తెనాలి డీఎస్పీ స్రవంతి రాయ్ హెచ్చరించారు. కోడిపందేల స్థావరాలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు ఆమె తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిర్వాహకుల్ని బైండోవర్ చేసి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.

రాష్ట్రంలో కొన్ని ఆలయాలపై దాడుల నేపథ్యంలో ప్రార్థనా మందిరాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని ఆమె చెప్పారు. ఆలయ నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆలయాల వద్ద రాత్రి సమయంలో పోలీసుల ద్వారా గస్తీ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చూడండి:

భార్గవరామ్‌ ఎక్కడ?: బెంగళూరు, పుణెలకు పోలీసు బృందాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.