లాక్డౌన్ కారణంగా మూతపడిన ఆలయాలన్నీ తెరుచుకున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భక్తులను థర్మల్ స్క్రీనింగ్ పరీక్షల అనంతరమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తుల వివరాలు నమోదు చేసుకుంటున్నారు. థర్మల్ స్క్రీనింగ్‌లో తేడాలు వచ్చిన వారిని ఇళ్లకు పంపిస్తున్నారు. ఆలయంలో ఎలాంటి ప్రత్యేక పూజలకు అధికారులు అనుమతులు ఇవ్వటం లేదు. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
ఇదీ చూడండి