గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో నేటి నుంచి టెలి కన్సల్టేషన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఎయిమ్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిమ్స్‌లోని 8523007940 నంబరుకు వీడియోకాల్, ఆడియోకాల్, సంక్షిప్త సందేశం ద్వారా నిపుణులైన వైద్యులను దిగువ షెడ్యూల్ ప్రకారం సంప్రదించవచ్చని తెలిపారు.
ఏయే రోజుల్లో ఎవరెవరు...
వారం | ఉదయం 9-11 | 11-1 |
సోమవారం | జనరల్ మెడిసిన్ | ఎముకల వైద్యులు |
మంగళవారం | కమ్యూనిటీ, ఫ్యామిలీ మెడిసిన్ | చెవి, ముక్కు, గొంతు నిపుణులు |
బుధవారం | జనరల్ మెడిసిన్ | ఎముకల వైద్యులు |
గురువారం | చర్మ వ్యాధులు | చిన్న పిల్లల వైద్య నిపుణులు |
శుక్రవారం | కమ్యూనిటీ, ఫ్యామిలీ మెడిసిన్ | మహిళ, ప్రసూతి వైద్య నిపుణులు |
శనివారం | నేత్ర వైద్య నిపుణులు | జనరల్ సర్జన్ |