అమరావతిలో రైతులు, మహిళల నిరసనకు మద్ధతుగా.. తెదేపా నేతలతో కలిసి తెలంగాణ తెలుగు మహిళ అధ్యక్షురాలు జ్యోత్స్న రాజధాని ప్రాంతంలో పర్యటించారు. కృష్ణాయపాలెం, ఐనవోలు, వెలగపూడి, తుళ్లూరుల్లోని దీక్షా శిబిరాలను ఆమె సందర్శించారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 376వ రోజు నిరసన తెలుపుతున్న రైతులతో కలిసి.. వెంకటపాలెంలో ఆందోళనలో పాల్గొన్నారు.
అమరావతినే రాజధానిగా ప్రకటించాలని, ఉద్యమానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని.. కృష్ణాయపాలెం రైతులు షిర్డీలో సాయి నాథుడ్ని కోరుకున్నారు. జై అమరావతి అంటూ అక్కడ నినాదాలు చేశారు. అనంతరం అమరావతికి మద్దతుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి: