గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులో అక్రమంగా తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 32 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ అధికారి నరసింహరావు తెలిపారు. వీరికి తెలంగాణలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి సరఫరా చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని వెల్లడించారు.
మూడో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రజలు కూడా తమకు సహకరించి... ఇలాంటి ఘటనలపై సమాచారం అందిస్తే వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: