ETV Bharat / state

Irrigation Projects: సాగర్​లో కృష్ణమ్మ సందడి.. జూరాల 47 గేట్లు ఎత్తివేత

author img

By

Published : Jul 31, 2021, 10:57 AM IST

నాగార్జునసాగర్‌లో కృష్ణమ్మ సందడి మొదలైంది. రోజుకు ఈ ప్రాజెక్టులో దాదాపు 32 టీఎంసీల నిల్వ పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రాజెక్టు వద్ద 4.54 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతోంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం 569.10 అడుగుల వరకూ నీళ్లు చేరాయి.

nagarjuna sagar
సాగర్​లో కృష్ణమ్మ సందడి

మరో 58 టీఎంసీల చేరితే నాగార్జునసాగర్​ జలాశయంలో నీరు పూర్తిస్థాయికి చేరుతుందని అధికారులు తెలిపారు. కృష్ణ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని బట్టి ఆదివారం రాత్రికి దాదాపు లక్ష్యాన్ని చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి వరద పెరిగితే ఆదివారం అర్ధరాత్రి లేదా సోమవారం గేట్లు తెరిచి దిగువకు వదిలే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

నాగార్జునసాగర్ జలాశయం ఇన్‌ఫ్లో 4,54,931 క్యూసెక్కులుండగా.. ఔట్‌ఫ్లో 35,820 క్యూసెక్కులు ఉంది. జలాశయ గరిష్ఠస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 567.20 అడుగల మేర నీరు చేరింది. సాగర్ గరిష్ఠ స్థాయి నీటినిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 254.31 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

సాగర్‌ జల విద్యుత్‌ కేంద్రం నుంచి ఉత్పత్తి అనంతరం 34,138 క్యూసెక్కులు నదిలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలానికి జూరాల నుంచి కృష్ణా నది ద్వారా 4.54 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర నది ద్వారా సుంకేశుల నుంచి 39,170 క్యూసెక్కుల వరద వస్తోంది.

ఈ ప్రాజెక్టు కుడి గట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి (ఏపీ) ఉత్పత్తి అనంతరం 27,336 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి (తెలంగాణ) 29,200 క్యూసెక్కులు, స్పిల్‌వే ద్వారా (పది గేట్లు ఎత్తి) మొత్తం 5.26 లక్షల క్యూసెక్కులు నదిలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి పరీవాహకంలోని ప్రాజెక్టులకు స్వల్పంగా ప్రవాహం వస్తోంది.

ప్రాజెక్టులకు భారీ ప్రవాహం వస్తున్న క్రమంలో జలాశయాల నుంచి రెండు రాష్ట్రాల్లోని సాగు, తాగు అవసరాలకు నీటి విడుదలను ప్రారంభించారు. శ్రీశైలం, సాగర్‌, జూరాల కింద నీటి విడుదల వివరాలు.

  • శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీలోని హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకానికి 2,026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 20 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తెలంగాణలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
  • జూరాలనుంచి నెట్టెంపాడు, బీమా రెండో దశ ఎత్తిపోతలకు 750 క్యూసెక్కుల చొప్పున, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతలకు 630క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
  • నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి తెలంగాణలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు (ఎస్‌ఎల్‌బీసీ) 1100 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

ఎగువ నుంచి జూరాలకు వరగ కొనసాగుతోంది. జలాశయంలోకి 4.77 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 4.73 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. జూరాల జలాశయం 47 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 9.657 టీఎంసీలుండగా.. ప్రస్తుతం 6.462 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది.

ఇదీ చదవండి:

Srisailam: శ్రీశైలానికి 5.59 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.