రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు పోలేరమ్మ తల్లి తిరునాళ్ళు మే 4న జరపనున్నట్లు తహసీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. కొండపాటూరులో తిరునాళ్ళ ఏర్పాట్లపై దేవాదాయశాఖ ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. లక్షలాది మంది తరలివచ్చే ఈ తిరునాళ్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, గ్రామస్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు, బాపట్ల, పొన్నూరు, చిలకలూరిపేటల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. తాగునీటి వసతి, పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు నిర్వహించాలని.. ప్రతి గంటకు ఆలయంలో శానిటైజర్ చేపించాలని అధికారులకు తహసీల్దార్ ఆదేశించారు.
పోలీసులతో బందోబస్తు...
తిరునాళ్లకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా 300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన భక్తులకు వైద్యులు అందుబాటులో ఉంటారని.. ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇవీ చూడండి...: దాచేపల్లిలో పోలీసుల తనిఖీలు.. 4 లక్షల మద్యం స్వాధీనం