మున్సిపల్ టీచర్ల(teachers protest) సమస్యలు పరిష్కరించాలంటూ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య ఆధ్వర్యంలో గుంటూరులో ఆందోళన జరిగింది. పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. ఆందోళనకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంతో కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఈ ఆందోళనలో శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జీ, కేఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు.
మున్సిపల్ హైస్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాలకు నగదు వెంటనే బదిలీ చేయాలని, హైస్కూల్ హెడ్ మాస్టర్లకు గెజిటెడ్ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. కనీసం పాలనాపరమైన అంశాలను కూడా పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఎమ్మెల్సీ సాబ్జీ మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న వారితో పురపాలక శాఖ అదనపు సంచాలకు ఆశాజ్యోతి చర్చించారు. అయితే ఇద్దరు ఎమ్మెల్సీలు వచ్చి ఆందోళన చేస్తుంటే కనీసం పురపాలక శాఖ కమిషనర్ రాకపోవటాన్ని తప్పుబట్టారు. కమిషనర్ వచ్చి హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: