ETV Bharat / state

ప్రత్తిపాడులో కొత్తపొత్తు... తెదేపా - వైకాపా మద్దతుదారుల దోస్తీ..! - AP Political news

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు.. కొత్త కొత్త సినిమాలు చూపిస్తున్నాయి. ఎన్నికలు ఏవైనా నువ్వానేనా అన్నట్టు తలపడే తెదేపా - వైకాపా మద్దతుదారులు ఒక్కటయ్యారు. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. ఈ ఘటనకు సాక్ష్యం.. సాక్షాత్తూ మన రాష్ట్ర హోంమంత్రే..!

ప్రత్తిపాడులో కొత్తపొత్తు... తెదేపా-వైకాపా మద్దతుదారుల దోస్తీ..!

author img

By

Published : Feb 11, 2021, 9:45 PM IST

గుంటూరు జిల్లాలో.. రాష్ట్ర హోంమంత్రి సుచరిత నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడులో... సర్పంచి పదవి కోసం... తెదేపా-వైకాపాలు రసవత్తర రాజకీయాన్ని తెరపైకి తెచ్చాయి. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్టు పోటీపడిన ఇరుపార్టీల అనుచరులు.. చివరికి ఒక ఒప్పందానికి రావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. తొలుత రెండు పార్టీలు వారి మద్దతుదారులను బరిలో దించాలని భావించారు.

అంతలోనే వైకాపాకు చెందిన నాయకులు ఉప సర్పంచి పదవి కోసం గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో సర్పంచి, ఉప సర్పంచి పదవులను వేలంలో రూ.40 లక్షల వరకు దక్కించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తెదేపా బలపర్చిన అభ్యర్థులను పోటీకి రాకుండా ప్రతిపాదనలు పంపారు. తమ పార్టీకి చెందిన అభ్యర్థిని బలపరిస్తే... 18 నెలలు ఇంఛార్జి సర్పంచి పదవి ఇస్తామని తెదేపా మద్దతుదారుకు వైకాపా నాయకులు ఆఫర్ ఇచ్చారు.

ఈ విషయాన్ని మంత్రి దృష్టికి రాగా.. ఆమె సానుకూలంగా స్పందించారు. అంగీకార ఒప్పందాన్ని గుంటూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసి... స్టాంపులపై సంతకాలు చేశారు. ఆ రిజిస్ట్రేషన్ పత్రాలను మంత్రి వ్యక్తిగత సహాయకుడి సమక్షంలో రెండు పార్టీల వారు ఇచ్చిపుచ్చుకున్నారు.

అభ్యర్థులు ఎవరనేది ఖరారు కాకుండానే...

వైకాపా తరపున పోటీలో ఉండే సర్పంచి అభ్యర్థి, వార్డు సభ్యులు ఎవరనేది ఖరారు కాకుండానే... ఈ ఒప్పందం చేసుకోవడం గమనార్హం. ప్రత్తిపాడు సర్పంచి అభ్యర్థిగా వైకాపా మద్దతుదారులు ముగ్గురు పోటీలో ఉండేందుకు సిద్ధం కాగా... ఒప్పందం చేసుకున్న నాయకులు ఎవరిని ఎంపిక చేస్తారో తెలియక, అసంతృప్తి వర్గం ముందుగానే సర్పంచి అభ్యర్థులుగా మేడా పూలవతి, వసుపర్తి ధనలక్ష్మి, వార్డు అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు.

ఇదీ చదవండి:

ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీకి ఆదిలోనే అవాంతరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.