ETV Bharat / state

ఎవరు ఏమన్నా, కాదన్నా అదానీకే జై - 'జగన్‌మాయ'పై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ కథనం - EX CM JAGAN IN ADANI CASE

అదానీతో సౌర విద్యుత్తు కొనుగోలుకు గత ప్రభుత్వం ఒప్పందం - సెకి సంప్రదించిన మర్నాడే క్యాబినెట్‌ ఆమోదం

EX CM Jagan in Adani Issue
EX CM Jagan in Adani Issue (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

International News Agency Reuters Wrote Article on Jagan : అదానీతో సౌర విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందం ఏమాత్రం మంచిది కాదని, ఖజానా భారీగా నష్టమని అధికారులు చేసిన సూచనలను నాటి జగన్‌ ప్రభుత్వం బేఖాతరు చేసిందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ స్పష్టం చేసింది. సెకి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం, విద్యుత్తు కొనుగోలుకు ఆమోద ముద్ర తెలపడం ఏపీఈఆర్​సీ (APERC) పచ్చజెండా ఊపడం అన్నీ అసాధారణ వేగంతో జరిగాయని తెలిపింది. అదానీ ఒప్పందాన్ని ఇలాగే కొనసాగిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏటా సామాజిక భద్రత, పోషకాహారానికి వెచ్చించేంత సొమ్ము చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది.

రాష్ట్రానికి స్వల్పకాలిక సౌర విద్యుత్తు అవసరాలు ఏమీ లేవు : అదానీ గ్రీన్స్ నుంచి సౌర విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి తొలి నుంచీ జరిగిన పరిణామాలను పరిశీలించి అంతర్జాతీయ వార్తా సంస్థ - రాయిటర్స్ మంగళవారం ఒక ప్రత్యేక కథనాన్ని విడుదల చేసింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-సెకి 2021 సెప్టెంబరు 15న అనుసరించిన విధానం చాలా అస్పష్టంగా ఉందని తన కథనంలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కొనుగోలు ఒప్పందం చేసుకుంటుందేమో తెలుసుకోవాలని సెకి ఎందుకు భావించిందో అర్థంకాని విషయమని సందేహం వ్యక్తం చేసింది.

అంతకు రెండేళ్ల ముందు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి వచ్చే పదేళ్ల కాలంలో రాష్ట్రానికి స్వల్పకాలిక సౌర విద్యుత్తు అవసరాలు ఏమీ లేవని, 24 గంటల విద్యుత్తును అందించే ఇతర పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై దృష్టిసారించాలని సూచించింది. అయితే - రాయిటర్స్ పరిశీలించిన కేబినెట్ రికార్డుల ప్రకారం ప్రభుత్వాన్ని సెకి సంప్రదించిన మర్నాడే అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం ఆ ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది.

"సెకి" పవర్ డీల్ - విద్యుత్‌ సర్దుబాటుకు డిస్కంల గారడీలు

నవంబరు 11 కల్లా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు కొనుగోలు ఒప్పందానికి రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి నుంచి ఆమోదం పొందింది. డిసెంబరు 1న అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. భవిష్యత్తులో దాని వార్షిక విలువ 490 మిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. రాయిటర్స్ పరిశీలించిన ఒప్పంద దస్తావేజుల ప్రకారం ఆ ఒప్పంద విలువలో 97% అదానీ గ్రూప్ పరిధిలో ఉన్న అదానీ గ్రీన్‌కు వెళ్లనుంది. 7,000 మెగావాట్ల కొనుగోలు ఒప్పందం కోసం సెకి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాక దానికి విద్యుత్తు నియంత్రణ కమిషన్ ఆమోదం పొందడానికి 57 రోజులే పట్టింది. ఇది చాలా అసాధారణ వేగమని రాయిటర్స్‌తో రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ సంస్థ మాజీ అధికారి, ఎనర్జీ లీగల్ నిపుణులు చెప్పారు.

చెల్లింపుదారులు భారం : రాయిటర్స్ సంస్థ మొత్తం 19 రాష్ట్ర ప్రభుత్వ డాక్యుమెంట్లను సమీక్షించింది. ఈ డీల్ గురించి 12 మందికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను, స్వతంత్ర ఇంధన, న్యాయ నిపుణులతో మాట్లాడింది. అయితే చాలా మంది తమ వివరాలను బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదు. ఈ భారీ డీల్‌ను ఆమోదించే విషయంలో ఆర్థిక, విద్యుత్తుశాఖలు చేసిన సలహాలు, సూచనలను రాష్ట్ర రాజకీయ నాయకత్వం పక్కన పెట్టినట్లు వారంతా స్పష్టం చేశారు. ఆ ఒప్పందం రాష్ట్ర ఖజానాకు భారంగా మారే అవకాశం ఉందని కొందరు బహిరంగంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు అవసరం లేకపోయినా వేల మెగావాట్ల విద్యుత్తును పన్ను చెల్లింపుదారులు భరించాల్సి ఉంటుందని తెలిపారు.

228 మిలియన్ డాలర్లు ఆఫర్ : మరో ఏడుగురు ఎగ్జిక్యూటివ్స్ లంచాలు, సెక్యూరిటీ మోసాల్లో పాలుపంచుకున్నట్లు, అందులో దేశంలోని పలు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉన్నట్లు గత నవంబరులో అభియోగాలు మోపారు. సెకికి అదానీ గ్రీన్ సరఫరా చేసే సౌర విద్యుత్తును రాష్ట్ర విద్యుత్తు సంస్థలు కొనుగోలు చేసేలా ఆదేశించేందుకు ఈ కేసులో ప్రతివాదులు ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఉన్నత స్థాయి వ్యక్తికి 228 మిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు US ప్రాసిక్యూటర్స్ ఆరోపించారు. దీనిపై జగన్‌ కార్యాలయం బదులివ్వలేదు. లంచాలు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను ఖండించింది. ఇతర ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి జగన్ కార్యాలయం నిరాకరించింది. అటు APERC కూడా అమెరికా ప్రాసిక్యూటర్స్ ఆరోపణల గురించి పదేపదే అడిగిన ప్రశ్నలకు స్పందించలేదు.

అంతా లెక్కల గారడీ - అదానీ విద్యుత్‌ కొనడం కోసం వైఎస్సార్సీపీ కుట్రలు

2021 సెప్టెంబరు 15న కుదిరిన సౌర విద్యుత్తు ఒప్పందం గురించి తనకేమీ తెలియదని అప్పటి విద్యుత్‌ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాయిటర్స్‌కు చెప్పారు. కేబినెట్ మినిట్స్ ప్రకారం విద్యుత్తు సరఫరా షెడ్యూల్ 2024 నుంచి ప్రారంభం అవుతుందని చెప్పిన తరుణంలో ఈ 25 ఏళ్ల కాంట్రాక్ట్ గురించి ఆర్థికశాఖ కూడా ప్రశ్నించింది. ఒప్పందం కుదుర్చున్న సమయానికి, విద్యుత్తు సరఫరా మొదలయ్యే సమయానికి మధ్య ధరలు తగ్గుతాయని చెప్పింది. ఆ సలహాను విద్యుత్తు శాఖ కూడా సమర్ధించింది.

ఏటా వందల మిలియన్ డాలర్ల బిల్లులు : కాంట్రాక్ట్ ఒప్పందాలను రాయిటర్స్ చేసిన పరిశీలన మేరకు ఒకవేళ అదానీ ఒప్పందం ఇలాగే ముందుకెళ్తే రాష్ట్ర ఖజానా నుంచి ఏటా వందల మిలియన్ డాలర్ల బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ విద్యుత్తు సరఫరా పూర్తి స్థాయిలో మొదలైతే ఏటా చేయాల్సిన చెల్లింపులు గత ఏడాది సామాజిక భద్రత, పౌష్టికాహార కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుకు సమానంగా ఉంటాయని రాయిటర్స్ సంస్థ తన కథనంలో తెలిపింది.

'ఇలాంటి వెర్రివాడా ఐదేళ్లు మనల్ని పాలించింది' - జగన్​పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.