గుంటూరు జిల్లా చిలకలూరిపేట తెదేపా కార్యాలయంలో నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం 12 గంటలపాటు నిరసన దీక్ష చేపట్టారు. మద్యం షాపులను తక్షణమే మూసివేయాలని, పెoచిన కరెంట్ చార్జీల నూతన స్లాబ్ విధానాన్ని వెoటనే రద్దు చేయాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు.
పెంచిన కరెంటు బిల్లులను పున:సమీక్షించి తగ్గించిన విద్యుత్ బిల్లులతో కూడిన డిమాండ్ నోటీసులు మరలా వినియోగదారులకు పంపిణీ చేయాలని కోరారు. మద్యం ధరలు పెరిగితే పేదల బ్రతుకులు మరింత దిగజారిపోతాయని, గత 45 రోజుల నుండి మద్యం లేకుండా ప్రజలు హాయిగా జీవించారని, ప్రభుత్వం తలపెట్టిన మద్యపాన నిషేధాన్ని అమలు చేయడానికి ఇదే సరైన సమయం అని మహిళా నేతలు పేర్కొన్నారు. మద్యం దుకాణాలు వద్దకు వెళ్లిన భర్తలు కరోనాను తెచ్చి కుటుంబ సభ్యులకు అంటిస్తున్నారని, మహిళలు, పిల్లలు ప్రభుత్వ నిర్ణయానికి బలై పోతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదాయం కోసం కుటుంబాలను విచ్ఛిన్నం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.