మద్యం దుకాణాలు వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయంలో తెలుగు మహిళలు దీక్షలు చేపట్టారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెదేపా ఇంఛార్జ్ కోవెలమూడి రవీంద్ర ఈ దీక్షలను ప్రారంభించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆదాయం కోసం ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచిందని రవీంద్ర ఆరోపించారు. అలాగే విద్యుత్ బిల్లులు పెంచి ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలని సూచించారు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకునేందుకు మద్యం షాపులు తెరవడాన్ని తెలుగుమహిళ నాయకురాలు ఉమ ఆక్షేపించారు. వెంటనే మద్యం షాపులను మూసివేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ముందు చూస్తే కరోనా.. వెనుక చూస్తే క్యాన్సర్!