Yedlapati venkatrao cremation: వయోభారంతో రెండు రోజుల క్రితం మరణించిన తెదేపా సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు అంత్యక్రియలు ముగిశాయి. తెనాలిలోని బుర్రిపాలెం రోడ్డులో ఉన్న శ్మశానవాటికలో అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు, సహా పలువురు నేతలు.. యడ్లపాటి పార్థివదేహానికి నివాళులు అర్పించి, అంతిమయాత్రలో పాల్గొన్నారు. యడ్లపాటి వెంకట్రావు.. ప్రజలకు, తెదేపాకు చేసిన సేవలను.. పార్టీ నాయకులు స్మరించుకున్నారు.
యడ్లపాటి జీవితం అందరికి ఆదర్శం: చంద్రబాబు
యడ్లపాటి వెంకట్రావు జీవితం అందరికి ఆదర్శనీయమని చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన మంచి విద్యావంతులు, ప్రజల కోసం జీవితాంతం పని చేశారని అన్నారు. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో వెంకట్రావుని చూసి నేర్చుకోవాలని.. ఆయన చేసిన పనులు శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. తెదేపాకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.
ఇదీ చదవండి:
Yadlapati: 'యడ్లపాటి పదవుల కోసం కాకుండా.. ప్రజల కోసం పని చేశారు'