ETV Bharat / state

దళితులపై వైెస్సార్సీపీ నేతల దాడులు - రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఎస్సీ సెల్​ విభాగం ఆందోళనలు

TDP SC Cell Protest on Attack On Dalits in AP: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో దళితులపై దాడులు పెరుగుతూ వచ్చాయని.. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్​ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడం లేదని.. దాడులు చేసిన వారిని అక్కున చేర్చుకుని కాపాడుతోందని ఎస్సీ సెల్​ విభాగం నాయకులు మండిపడ్డారు.

_tdp_sc_cell_protest_on_attack_on_dalits_in_-ap

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2023, 3:10 PM IST

TDP SC Cell Protest on Attack On Dalits in AP: వైసీపీ ప్రభుత్వం దళితుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం ఎస్సీ సెల్​ విభాగం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. సీఎం జగన్​ మోహన్​ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో దాదాపు ఆరు వేలకు పైగా దాడులు జరిగినట్లు.. ఎస్సీ సెల్​ విభాగం నాయకులు మండిపడ్డారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో వైసీపీకి రాజకీయ సమాధి కడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళితులపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. నెల్లూరు జిల్లా టీడీపీ ఎస్సీ సెల్​ విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నగరంలోని విఆర్సీ సెంటర్​లోని అంబేడ్కర్​ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇటీవల ఎన్టీఆర్​ జిల్లాలోని కంచికచర్లలో ఓ దళిత యువకుడిపై దాడి దారుణమని.. సమాజం తలదించుకునేలా వైసీపీ గుండాలు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడితో ఆగకుండా అతనిపై మూత్ర విసర్జన చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

శ్యామ్‌కుమార్‌పై దాడిని ఖండించిన దళిత సంఘాలు - సత్వర చర్యలు చేపట్టకపోతే ఆందోళనలు విస్తృతం చేస్తామంటూ హెచ్చరిక

దళిత ఓట్లతో గద్దెకెక్కిన ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి.. దళితులపై దాడులు జరుగుతుంటే పట్టించుకోకపోవడం ఏంటనీ ప్రశ్నించారు. డాక్టర్​ సుధాకర్​ దగ్గరి నుంచి శ్యాం కుమార్​ వరకు ఎంతో మంది దళితులపై దాడులు జరిగాయని టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు అన్నారు. ఒక పక్క ఇలా దళితులపై దాడులు జరుగుతుంటే.. వైసీపీ పార్టీ సమాజిక సాధికరత పేరుతో బస్సుయాత్ర నిర్వహించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దాడులను ఆపకుంటే ఉద్యమిస్తామని ​హెచ్చరించారు.

కోనసీమ జిల్లాలో: రాష్ట్రంలో దళితులపై దాడిని నిరసిస్తూ.. అంబేడ్కర్​ కోనసీమ జిల్లాలో నిరసన చేపట్టారు. జగన్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా దళితులపై దాడులు జరుగుతున్నాయని.. జిల్లాలోని ముమ్మిడివరంలో టీడీపీ ఎస్సీ సెల్​ విభాగం ఆందోళన చేపట్టింది. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి.. దళితుల సంక్షేమం కోసం ఉద్ద్యేశించిన పథకాలను ప్రభుత్వం ఎత్తిపడేసిందని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే దళితులపై దాడి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ జమానాలో మరో దళిత బిడ్డకు ఘోర అవమానం: లోకేశ్

ముఖ్యమంత్రి సైకో జగన్ మోహన్​ రెడ్డి ప్రతి సభలో.. నా ఎస్సీలు, నా ఎస్టీలని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాడని నేతలు మండిపడ్డారు. ఎస్సీలపై దాడులు జరుగుతున్న జగన్​ రెడ్డి ఏ రోజు ఖండించలేదని మండిపడ్డారు. అంతేకాకుండా దాడులకు దిగిన వారికి శిక్షలు జగన్​ కాపాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

కర్నూలు జిల్లాలో: వైసీపీ పాలనలో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని కర్నూలు తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం నాయకులు నిరసన చేపట్టారు. ఎస్సీ సెల్​ విభాగం నాయకులు మాట్లాడుతూ.. దళితులు నా సోదరులు అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి.. వారిపై దాడులు జరుగుతుంటే ఎందుకు అరికట్టడం లేదని ప్రశ్నించారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలకు రానున్న ఎన్నికల్లో ఓటు రూపంలో.. ఎస్సీలు వైసీపీ బుద్ది చెప్తారని అన్నారు.

TDP Anitha comments: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు.. నాలుగేళ్లలో 4వేల హత్యాచారాలు : అనిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.