ETV Bharat / state

TDP Protests Continues Against CBN Arrest: టీడీపీ అలుపెరుగని పోరాటం.. చంద్రబాబు ఆరోగ్యం మెరుగుపడాలని పూజలు, హోమాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2023, 8:11 PM IST

TDP Protests and Dharnas Against Chandrababu Arrest: చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు నిరసనలు, ధర్నాల కొనసాగాయి. తమ అధినేత ఆరోగ్యం మెరుగుపడాలంటూ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపులు మాని వెంటనే మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

tdp_protests
tdp_protests

TDP Protests and Dharnas Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరనసగా తెలుగుదేశం(TDP Protests) ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బాబు ఆరోగ్యం కుదుటపడాలని విజయవాడ గుణదల మేరీ మాత గుడిలో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన 200 మంది క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంకెళ్లు వేసుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. వైసీపీ వాళ్లు చేసే ప్రతి చర్యకూ ప్రతి చర్య ఉంటుందనే విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. బాబు ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు.

మాజీ ఎంపీ కొనకళ్ల ఇందులో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక గంగానమ్మ ఆలయంలో మండలి బుద్ధప్రసాద్ చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు(Special Pujas for Chandrababu) చేశారు. బాబు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే మంత్రులు, వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పెనమలూరు నియోజకవర్గం కామయ్యతోపు కూడలిలో గంగానమ్మ ఆలయంలో పూజలు జరిపారు.

EX minister Aadi Narayana Reddy Reacted On CBN Arrest: "అవినాష్​ రెడ్డి అరెస్టును అడ్డుకుని.. చంద్రబాబును ఎలా అరెస్టు చేస్తారు"

బాపట్ల జిల్లా వల్లాపల్లి నుంచి బల్లికురవలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ 8వ రోజు సైకిల్ యాత్ర చేశారు. చంద్రబాబు అక్రమ(Chandrababu Arrest) అరెస్టుతో వైసీపీ పతనాన్ని కోరితెచ్చుకుందని మండిపడ్డారు. పర్చూరు నుంచి కోటప్పకొండ వరకు టీడీపీ శ్రేణులు ద్విచక్రవాహన ర్యాలీ చేశాయి. బొమ్మలకూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేశారు. వినాయక ఆలయంలో పూజలు చేశారు. అన్నంబొట్ల వారిపాలెం, పసుమర్రు, చిలకలూరిపేట, మద్దిరాల మీదుగా బైక్ ర్యాలీ సాగింది. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలంటూ అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి సీతారామ ఆలయంలో పూజలు చేశారు. ముత్యాలమ్మ ఆలయంలో 300 గుమ్మడి కాయలు కొట్టారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలని నినదించారు. అన్నమయ్య జిల్లా చిట్వేలులో టీడీపీ, జనసేన నాయకులు సత్యమ్మ తల్లి ఆలయంలో పూజలు చేశారు. చిట్వేల్ ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు.

Chandrababu Health Condition: చంద్రబాబు శరీరంపై తీవ్రమైన దద్దుర్లు, పొక్కులు.. శీతల వాతావరణం తప్పనిసరి

శ్రీకాకుళం జిల్లా రణస్థలం నుంచి తిరుమలకు చేపట్టిన తెలుగుదేశం నాయకుల సైకిల్‌ యాత్ర నెల్లూరు జిల్లా సంగం చేరింది. స్థానిక నాయకులు వారికి స్వాగతం పలికారు. చంద్రబాబు ఆరోగ్యం కుదుటపడాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం శంకర్ గుప్తంలోని చర్చిలో ప్రార్థనలు చేశారు. ఆలమూరు మండలం మడికిలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఇంటింటికి వెళ్లి బాబుకు మద్దతివ్వాలని కరపత్రాలు పంచారు. కాకినాడ జిల్లా కరకుదురు, రాజుపాలెం గ్రామాల్లో కనకదుర్గమ్మ ఆలయంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జనసైనికులతో కలిసి పూజలు చేశారు. చంద్రబాబు పేరిట అభిషేకాలు చేయించారు.

Rushikonda Was Destroyed by the YSRCP Government: భవిష్యత్​లో పేరుకే రుషి'కొండ'.. 90 శాతానికి పైగా విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతులు

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ద్విచక్ర వాహన ర్యాలీ(TDP bike rally) నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురంలోని శ్రీనివాసనంద సయూమి ఆశ్రమంలో హోమం నిర్వహించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్ పాల్గొన్నారు. అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో టీడీపీ నేతలు పూజలు చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీ నాయకులు సూర్య నమస్కారాలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మహిళలు హనుమాన్ చాలీసా చదివారు..

TDP Protests Continues Against CBN Arrest: టీడీపీ అలుపెరుగని పోరాటం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.