ETV Bharat / state

Lokesh Attend to Court: వివేకా హత్య కేసులో జగన్​ పాత్రపై సీబీఐ విచారించాలి: నారా లోకేశ్ - lokesh demands cbi enquiry on jagan

Lokesh Attend Mangalagiri Court: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. అదనపు మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చారు. వైఎస్సార్సీపీ నేతలు గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, పోతుల సునీతపై పరువునష్టం దావా వేశారు. తనపై అసత్య ప్రచారం చేశారని, ఉమామహేశ్వరి మరణం, హెరిటేజ్ సంస్థపై అసత్య ప్రచారాలు చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేశ్‌ కోరారు. వివేకా హత్యలో జగన్మోహన్ రెడ్డి పాత్రపైనా సీబీఐ విచారణ జరగాలని నారా లోకేశ్ డిమాండ్‌ చేశారు. పాదయాత్రలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై తాను చేస్తున్న ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే సిట్ వేసి అందరి సంగతి తేలుస్తామని హెచ్చరించారు.

tdp national secretary lokesh
tdp national secretary lokesh
author img

By

Published : Jul 14, 2023, 5:30 PM IST

Lokesh Attend Mangalagiri Court: తనపై తప్పుడు ప్రచారం చేసే ఎవ్వరినీ వదిలిపెట్టనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. 2012 నుంచి తన రాజకీయ ఎదుగుదలను లక్ష్యంగా చేసుకుని అసత్య ఆరోపణలు చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ఆరోపణలకు ఇక చెక్ పెట్టాలనే పరువునష్టం దావాలు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. చేసిన అసత్య ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని హెచ్చరించినా పోతుల సునీత వినలేదు కాబట్టే రూ.50కోట్లకు పరువునష్టం దావా వేశానని తెలిపారు. తోబుట్టువులు లేని తనకు పిన్నమ్మ కూతుళ్లనే సొంత సోదరీమణులుగా చూసుకున్నానని చెప్తూ.. అలాంటి తనపై గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి తప్పులు పోస్టు పెట్టినందుకు రూ.50కోట్లకు పరువు నష్టం దావా వేసినట్లు వెల్లడించారు. ఏనాడూ తప్పు చేయలేదు కాబట్టే తమపై చేసిన ఆరోపణల్ని ఒక్కటీ నిరూపించలేకపోయారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిపై తాము ఆధారాలతో ఆరోపణలు చేశాం కాబట్టే... జైలుకెళ్లటంతో పాటు అక్రమ ఆస్తుల జప్తు జరిగిందని గుర్తు చేశారు. వివేకా హత్యపై నారాసుర రక్త చరిత్రంటూ అసత్యాలు రాశారని.. కానీ సీబీఐ చార్జ్ షీట్​లో ఇప్పుడెవ్వరు ఉన్నారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

వివేకా హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్రపైనా సీబీఐ విచారణ జరగాలని నారా లోకేశ్ డిమాండ్‌ చేశారు. పాదయాత్రలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై తాను చేస్తున్న ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే సిట్ వేసి అందరి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలపై తాను చేస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేయించుకునే దమ్ము వారికుందా అని సవాల్‌ విసిరారు. సీఐడీ సీఎం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్​మెంట్​గా మారిపోయిందని విమర్శించారు. దేవాన్ష్ పుట్టినప్పటి నుంచీ తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానానికి దాదాపు 2కోట్ల విరాళం ఇచ్చామని... అలాంటిది తమపై పింక్ డైమండ్ దొంగతనం ఆరోపణలు చేసి పారిపోయారని మండిపడ్డారు. తనపై చేసే ఆరోపణలకు ఎన్నోసార్లు తాను సవాల్ విసిరినా, వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప నిరూపించలేకపోయారని తెలిపారు.

తనపై అసత్య ప్రచారం చేశారని వైఎస్సార్సీపీ నాయకులు గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, పోతుల సునీతపై లోకేశ్ పరువునష్టం దావా వేశారు. ఈ రోజు లోకేశ్ మంగళగిరి కోర్టుకు హాజరై అదనపు మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఉమామహేశ్వరి మరణం, హెరిటేజ్ సంస్థపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపిస్తూ.. వైఎస్సార్సీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ నాడు కాంగ్రెస్, నేటి వైఎస్సార్సీపీ తమపై వ్యక్తిగత విమర్శలు సాగిస్తూనే ఉన్నాయని లోకేశ్ ధ్వజమెత్తారు. 40ఏళ్ల నుంచీ తమ కుటుంబం ఈ అసత్య ఆరోపణల్ని భరిస్తూనే ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 6లక్షల కోట్ల అవినీతి జరిగిందని పుస్తకం ముద్రించిన వైఎస్సార్సీపీ నేతలు.. 6పైసల అవినీతి కూడా నిరూపించలేకపోయారని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.