డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 129 వ జయంతిని.. తెదేపా నేత నక్కా ఆనందబాబు.. గుంటూరు వసంతరాయపురంలోని తన కార్యాలయంలో నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. ఆయన రాసిన రాజ్యాంగ విలువలను కొన్ని పార్టీలు తుంగలో తొక్కుతున్నాయన్నారు. అంబేద్కర్ ఆశయాలకోసం ఏర్పడిన పార్టీ తెదేపా అని చెప్పారు. మాస్క్ లు లేవని అడిగిన దళిత వైద్యుడు సుధాకర్ ను అవమానకరంగా సస్పెండ్ చేయడం దారుణమన్నారు.
ఇదీ చదవండి: